అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|

0
214

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల (చెవిటి మరియూ మూగ) పాఠశాలలో కమ్యూనిటీ అవుట్ రీచ్ మరియు సమ్ములిత చొరవలో భాగంగా గోపాలపురం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపి)  పి.సుబ్బయ్య విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

మారేడుపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) నోముల వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో మొత్తం 38 మంది పాఠశాల విద్యార్థులు, పాఠశాల నిర్వహకులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థుల మధ్యన కేక్ కట్ చేసిన పోలీసు సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీ మరియు ఇతర పోలీసు అధికారులు విద్యార్థులతో ఆత్మీయంగా సంభాషించి, వారికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని అందించారు. విద్యార్థుల మధ్యన సంరక్షణ, మరియు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని వారు నొక్కి చెప్పారు. 

తమతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని, ఈరోజును చిరస్మరణీయం చేసినందుకు విద్యార్థులు, మరియు నిర్వాహకులు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 

హైదరాబాద్ పోలీసుల మానవీయ కోణాన్ని, మరియు స్నేహపూర్వక విధానాన్ని  (people friendly policing)  చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. 

ఇది పోలీసులకు మరియు ప్రజలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసింది.

#sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల కీలక నిర్ణయం
*గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఎలా బడితే అలా బయటకు వెళ్ళటం కుదరదు అధికారి పర్మిషన్ తప్పనిసరి*...
By Rajini Kumari 2025-12-28 09:33:45 0 224
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 211
Andhra Pradesh
బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల...
By Boya Dasthagiri 2026-04-12 07:40:51 0 184
Andhra Pradesh
ఉపాధ్యాయులకు చంద్రబాబు శుభాకాంక్షలు.. సర్వేపల్లి జీవితం ఆదర్శనీయం.
  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు చంద్రబాబు శుభాకాంక్షలు విద్యార్థుల భవిష్యత్తును...
By Pagadala Venkateswar 2026-09-05 07:04:02 0 118
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్.
    Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్ 17-01-2026...
By Pagadala Venkateswar 2026-01-17 11:40:12 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com