మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే

0
309

మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే

మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్(డీజీపీ)గా 26/11 ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన సదానంద్ దాతే నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన 59 ఏళ్ల సదానంద్ జనవరి 3న బాధ్యతలు స్వీకరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అధిపతిగా ఉన్న ఆయన ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల్లో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. ఆర్థిక నేరాలపై పరిశోధనలకు గాను ఆయన పుణే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దాతే 26/11 ముంబై ఉగ్రదాడులను ఎదుర్కొన్న హీరోలలో ఒకరిగా నిలిచారు. 2008 నవంబర్ 26న ఉగ్రదాడుల సమయంలో ఆయన ముంబై సెంట్రల్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వం లోని ఓ బృందం కామా ఆసుపత్రిపై దాడి చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్లను చుట్టుముట్టింది. గ్రెనేడ్ శకలాల వల్ల దాతే తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఉగ్రవాదులతో పోరాడారు. ఆయన సేవలకుగాను కేంద్రం రాష్ట్రపతి పతకంతో సత్కరించింది. ఆ గ్రెనేడ్ శకలాలూ ఇప్పటికీ ఆయన శరీరంలో, కంటి దగ్గరా ఉన్నాయి. వాటిని గాయాలుగా కాక యుద్ధ క్షేత్రపు పతకాలుగా ఆయన అభివర్ణిస్తారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
Tomorrow medical shops closed
రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్   దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి....
By G k Nookala 2026-05-19 12:24:58 0 228
Telangana
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి...
By Sadaq Sadaq 2026-02-07 15:51:26 0 241
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
మోడీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు CPIపట్టణ సమితి...
By Boya Dasthagiri 2026-05-16 10:01:26 0 216
Telangana
ఒక నిబద్ధత గల ఒక మంచి మనిషిని తెలంగాణ కోల్పోయింది ! శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఏర్పాటు కోసం వీరోచితంగా పోరాటం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నివాళి !...
By Ponnala Srinivasrao 2026-07-31 02:22:51 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com