కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు.

0
733

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. డ్రంక్‌ అంగ్‌ డ్రైవ్‌ టెస్టులో అడ్డంగా బుక్కై నానా హంగామా చేశారు. కుల్సుంపురాలో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి కొత్త సంవత్సరం సందర్బంగా కొద్దిగా తాగితే తప్పేంటని వాదనకు దిగాడు.

 

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. డ్రంక్‌ అంగ్‌ డ్రైవ్‌ టెస్టులో అడ్డంగా బుక్కై నానా హంగామా చేశారు. కుల్సుంపురాలో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి కొత్త సంవత్సరం సందర్బంగా కొద్దిగా తాగితే తప్పేంటని వాదనకు దిగాడు. అంతటితో ఆగకుండా బ్రీత్ ఎనలైజర్.. ఎక్కువ తాగినట్లుగా చూపిస్తుందంటూ పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు.

 

కొత్త సంవత్సరం కాబట్టి కొద్దిగా తాగినానని.. బండి ఇప్పించాలంటూ ప్రాథేయపడ్డాడు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ బండి ఇప్పించండి మహాప్రభో అంటూ వేడుకున్నాడు.. పోలీసులు సర్థిచెప్పినా వినలేదు.. చివరకు డ్రెంకెన్ డ్రైవ్ చేసే బారీకేడ్ల వద్ద.. పోర్లుదండాలు పెట్టాడు.

 

చాలా సేపు అక్కడే ఉండి.. తన బైక్ ఇప్పించాలంటూ గోడకు తల బాదుకున్నాడు.. ఇంకా పోలీసుల కాళ్లు పట్టుకొని నానా హంగామా చేశాడు.. చివరకు పోలీసులు సర్థిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

నగరం అంతటా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేశారు.. అయితే.. చాలా ప్రాంతాల్లో ఇలాంటి సీన్ లు తెరపైకి వచ్చినట్లు పేర్కొంటున్నారు.

#Sivanagendra #Telangana #Hyderabad

 

Search
Categories
Read More
Andhra Pradesh
టీటీడీ భక్తులకు శుభవార్త
Ttd Annadanam Twice Daily In All Temples: ఏపీ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు...
By Pagadala Venkateswar 2026-01-21 09:35:08 0 199
BMA
Shrinking Editions: The 'Sweet Spot' Survival Strategy
Facing massive revenue deficits, Indian newspapers are adopting a desperate "Sweet Spot"...
By JoinBMA 2026-08-20 08:01:26 0 77
Telangana
సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం,...
By Sidhu Maroju 2025-10-21 18:01:54 0 323
Andhra Pradesh
S.F.S స్కూల్ రోడ్డు సమస్యపై 24 గంటల్లోనే పరిష్కారం తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే...
By Gadiyapudi Narendra 2026-02-03 16:14:46 0 395
Telangana
తెలంగాణ పేరు లేకుండా బతకలేరు.‎కేసీఆర్ పేరెత్తకుండా ఉండలేరు.
అందరి టార్గెట్ కెసిఆర్.. ఆ టార్గెటే ఆయన బలాన్ని సూచిస్తుంది ✊ ‎ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో...
By Ponnala Srinivasrao 2026-04-25 08:59:22 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com