సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు.|

0
224

హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఐదుగురు మహిళలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

 

అల్వాల్ కు చెందిన రాచర్ల పవన్ కుమార్(38) సజీవ దహనం కేసులో న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు.

 

ఈ కేసు వివరాల్లోకి వెళితే... జగిత్యాలకు చెందిన విజయ్ కొండగట్టుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఓ కుట్టిరాన్ని నిర్మించుకున్నాడు. అయితే విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు.

విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్ కుమార్ భార్య కృష్ణవేణి లతో కలిసి 2020 అక్టోబర్ 20 న కుటీరానికి చేరుకున్నాడు.

 

అయితే పవన్ కుమార్ తన భర్తకు చేతబడి చేసి చంపించాడని ఆరోపిస్తూ అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత భర్తతో కలిసి అతన్ని కుటీరంలో బంధించి పెట్రోల్ ఒంటిపై పోసి నిప్పంటించింది.

 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గది తాళం తీయగా పవన్ పూర్తిగా దహనమయ్యాడు. 

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పవన్ కుమార్ భార్య కృష్ణవేణి తో పాటు మరో ఐదుగురు మహిళలు ఈ కేసులో నిందితులుగా తేలారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ సాక్షదారాలను పరిశీలించిన న్యాయస్థానం కృష్ణవేణి సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైధు తో పాటు రూ. పదివేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

 

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రికోట రాజీవ్ రెడ్డి గారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ స్టేట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనీ రెడ్డి గారు కలవడం జరిగింది.
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారిని వైఎస్ఆర్ స్టూడెంట్ స్టేట్ యూనియన్...
By Boya Dasthagiri 2026-03-30 02:18:43 0 280
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ ఎస్పీ
సత్యసాయిజిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో...
By Vinod Kumar 2026-09-11 17:13:01 0 200
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 207
Telangana
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో...
By Prashanth Goindla 2026-07-30 20:50:33 0 161
SURAKSHA
V. Srinivas: Steering Rajasthan with Vision and Reform
An accomplished 1989-batch Rajasthan cadre IAS officer, V. Srinivas has combined administrative...
By Lokeshwari Panthadi 2026-07-23 09:24:45 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com