గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

0
251

కర్నూలు : కర్నూలుజిల్లా...

10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం ... 

అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా . 

గౌరవ ఏపీ  డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి పర్యవేక్షణలో  మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి  తగలబెట్టారు. 

ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా   గారు  మాట్లాడుతూ...

ఈ రోజు  కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో  27  కేసులలో  స్వాధీనం చేసుకున్న  126 కేజీ ల గంజాయిని   కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న  జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో  ఎక్సైజ్  అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు. 

 పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్  అనుమతితో , NDPS  Act  ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా  ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. 

దహనం చేసిన గంజాయి విలువ   రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు. 

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు. 

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,  ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి,  నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు,  సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు  పాల్గొన్నారు. 


Search
Categories
Read More
SURAKSHA
Breaking Glass Ceilings: The Inspiring Journey of IPS Kala Ramachandran
Breaking Ceilings: Inside IPS Kala Ramachandran’s Inspiring Journey: "Basic policing, the...
By Kalaga Sailaja 2026-07-21 05:30:38 0 20
Andhra Pradesh
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
By Boiena Rajesh 2026-03-02 14:48:45 0 184
Puducherry
Fishermen Warned Against Venturing into the Sea
Authorities have issued a marine safety advisory urging fishermen not to venture into the sea due...
By Navya Sree 2026-06-27 07:12:01 0 106
Andhra Pradesh
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి :డి ఎం హెచ్ ఓ.
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రజలను వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని...
By Pagadala Venkateswar 2026-04-29 05:06:07 0 107
SURAKSHA
రోడ్డు ప్రమాద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పోలీసులు
నిన్న రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను చూసి ఏపీ పోలీసులు మానవత్వంతో స్పందించారు....
By Kalaga Sailaja 2026-06-30 11:09:38 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com