ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్

0
204

 గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra pradesh High Court) కొట్టివేసింది. గ్రూప్ -2 రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం రోజు తీర్పు ఇచ్చింది. 2023 గ్రూప్ -2కు సంబంధించి రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు (AP Group - 2 Notification) చేయాలని పిటిషన్‌లో కోరారు

అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మేరకు రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని.. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయస్థానం అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగాయి. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణను ఆపాలంటూ అప్పట్లోనూ కొంతమంది పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టు నిరాకరించరింది. పరీక్షను నిలిపివేస్తే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని అభిప్రాయపడింది. అలాగే గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ఆధారంగా.. తదుపరి చర్యలన్నీ తమ తీర్పునకు లోబడే ఉంటాయని అప్పట్లో స్పష్టం చేసింది. మరోవైపు గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు 92 వేల 250 మంది అర్హత సాధించారు. అయితే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ మీద కొంతమంది అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన వారిలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు అర్హత సాధించింది ఇద్దరే. దీంతో గ్రూప్ 2 మెయిన్ పరీక్షను ఆపేస్తే మిగతా అర్హులైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటూ మెయిన్ పరీక్షను నిలిపివేసేందుకు ఏపీ హైకోర్టు అప్పట్లో నిరాకరించింది. తాజాగా గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కూడా ఏపీ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో.. గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరట లభించనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బేబినాయన
అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం...
By Boiena Rajesh 2026-04-13 13:42:36 0 209
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:00:59 1 357
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన నేత అడపా సురేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-08-08 05:23:19 0 115
SURAKSHA
M. Raja Murugan IPS: A Leader Shaping Modern Policing
A distinguished 1996-batch IPS officer of the Tripura Cadre, M. Raja Murugan has earned respect...
By Lokeshwari Panthadi 2026-07-27 04:43:50 0 251
Andhra Pradesh
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారు
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారిని...
By Chennaiah Kati 2026-01-20 07:02:07 0 386
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com