నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి

0
264

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి

అమరావతి, డిసెంబర్ 31: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు.

ఈ  ప్రత్యేక అనుమతులను అనుసరించి ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, 2025,  జనవరి 1, 2026 రాత్రుల్లో అర్ధరాత్రి 12.00 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు. అలాగే 2B (బార్లు), సి 1 (ఇన్-హౌస్), ఈపిఐ(ఈవెంట్ పర్మిట్),  టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించడానికి, రెస్టారెంట్ సర్వీస్ లకు అనుమతి పొందాయి.

గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలులో ఉన్న విధానానికి అనుగుణంగా ఈ సడలింపు ఇవ్వబడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం లేదా అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ఈ ఆదేశాల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

 

#నరేంద్ర

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తత సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:43:37 0 193
Andhra Pradesh
పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ
పుంగనూరు మండలం బండ్లపల్లె టీచర్ జ్యోతిలక్ష్మి, ఎలాంటి అనుమతులు లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి...
By Kothuru Murali 2026-02-13 06:18:07 0 182
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 1K
Telangana
" మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఈటల సందేశం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్‌పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు...
By Sidhu Maroju 2026-04-11 12:02:46 0 431
BMA
Courtroom Reporting: Judicial Bans on Live Tweeting
The power of legal journalism is facing new hurdles as certain High Courts impose strict...
By JoinBMA 2026-08-21 04:44:56 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com