తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సేవలో బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం

0
244

*తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం*

 

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దివ్యదర్శనం చేసుకున్నారు.

 

ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, స్వామివారి అనుగ్రహంతో ఈ పవిత్ర రోజున ప్రత్యేక దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.

కోటి పుణ్యాలకు నెలవైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా వేకువజామున కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సద్గుణాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నిండి ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

 

తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు అలంకరణ, ఇతర భక్తులకు సౌకర్యాలు, చాలా ప్రత్యేకంగా చేశారని, తిరుమల అధికారులకు, పాలక మండలికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు! 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-05-18 08:41:25 0 204
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*            *ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
By Rajini Kumari 2026-04-02 15:57:56 0 228
Sikkim
Union Minister Reviews Key Projects in Namchi
Coinciding with Statehood Day, Union DoNER Minister Jyotiraditya M. Scindia is on a high-profile,...
By Dunna Jessicaruth 2026-05-16 04:55:11 0 235
Andhra Pradesh
వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-02-28 11:11:29 0 226
Andhra Pradesh
Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-03-17 08:11:57 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com