సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

0
250

గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి శ్రీ కుర్రా అప్పారావుని శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మిర్చి రైతుల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, రైతులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ, మిర్చి యార్డు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వం చేపడుతున్న రైతు అనుకూల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.

సహకార సంస్థలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా ప్రజలకు, రైతులకు మరింత మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

అదే విధంగా గుంటూరు కల్పవల్లి కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ (సూపర్ బజార్) నూతనంగా పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పోనగంటి భారతిదేవి,

శ్రీ ఉప్పతల్ల సాంబశివరావు,

శ్రీ చింతకాయల వెంకట సాయి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు ఎమ్మెల్యే గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

కల్పవల్లి సూపర్ బజార్ మరింత ప్రజాభిముఖంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సహకార సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 219
Andhra Pradesh
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*   *Press Release 5*   *ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌...
By Rajini Kumari 2026-01-20 10:24:40 0 208
Andhra Pradesh
పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి...
By Kothuru Murali 2026-08-19 15:16:45 0 157
SURAKSHA
Lav Agarwal IAS: Leading India's Public Health Mission
A distinguished Andhra Pradesh cadre IAS officer whose visionary leadership in public health,...
By Lokeshwari Panthadi 2026-07-16 05:59:02 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com