అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే

0
265

అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే

 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రిని జర్నలిస్టులు ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్‌తో ఏం మాట్లాడారని వారు అడిగారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేసీఆర్, తాను మాట్లాడుకున్నది మీకెందుకు చెబుతామని చమత్కరిస్తూ సమాధానం ఇచ్చారు.

 

అంతేకాకుండా అసెంబ్లీకి వచ్చిన వెంటనే కేవలం 5 నిమిషాల్లోనే కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆపై వేరే విషయాలపై మీడియాతో సీఎం మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు యాక్సెస్ కల్పిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలలకు సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల వరకు మండలిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..

Search
Categories
Read More
Telangana
బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ...
By Chunarkar Jagadeesh 2026-06-28 06:58:57 0 236
BMA
The Off-Grid Syllabus: Training Future Journalists
Recognizing the increasing frequency of state-mandated internet blackouts, journalism schools are...
By JoinBMA 2026-08-21 11:24:54 0 325
Tamilnadu
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
By VALLERU SIMHADRI 2026-09-04 13:07:09 0 241
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు
గురువారం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాయి భాషా గారి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో...
By Benguluri Madhubabu 2026-06-11 08:56:10 0 172
SURAKSHA
Durga Shanker Mishra: Transforming Cities Through Vision
A distinguished 1984-batch IAS officer whose leadership in urban development, infrastructure, and...
By Lokeshwari Panthadi 2026-07-31 05:54:58 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com