ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు

0
412

మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు జిల్లాలోని 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్ కులముల బాలబాలికలకు ZPSS (బాలుర) పాఠశాల గూడూరు నందు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ 5 వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్న షెడ్యూల్ కులముల బాలురకు సం. 1000/- షెడ్యూల్ కులముల బాలికలకు రూ.1500/- మరియు 9,10 తరగతులు చదువుతున్న షెడ్యూల్ కులముల బాల బాలికలకు సాలిన 3500 /- (డేస్ స్కాలర్) రెసిడెన్షియల్ విద్యార్థిని విద్యార్థులకు రూ. 7000 / - ప్రభుత్వం స్కాలర్ షిప్ అందించనున్నట్లు మరియు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలు కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు మాత్రమే అర్హులని అదేవిధంగా 9 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నవారు అర్హులని తెలిపినారు. పూర్తి వివరాల కోసం, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించ వలసిందిగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గూడూరు గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Haryana
Law and Order Concerns
Tension gripped Karnal's Sector 9 today following the brazen daylight shooting of a 47-year-old...
By Dunna Jessicaruth 2026-05-16 06:43:39 0 136
Andhra Pradesh
రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం...
By BABJI DADALA 2026-01-23 12:06:37 0 666
SURAKSHA
AP పోలీసులు పేదలకు అన్నం, ఉచిత వైద్య సేవ
ఈరోజు AP పోలీస్ సిబ్బంది గుంటూరులోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడి భోజనం, తాగునీరు...
By Kalaga Sailaja 2026-07-06 05:33:50 0 144
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 292
Haryana
Tragic Death of 4-Year-Old in Ambala Borewell Accident
In a heartbreaking turn of events, four-year-old Nirvair Singh tragically lost his life after...
By Lokeshwari Panthadi 2026-07-01 09:07:37 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com