జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.
Posted 2026-07-23 15:54:40
0
232
మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్ ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు టేకుమట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.21,450 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఇతర వస్తువులతో పాటు జైపూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*స్థల డాక్యుమెంట్లు గల్లంతు
ఈపూరుపలెం
చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B...
మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.
మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది....
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
Madanapalle: మదనపల్లెలో ఈ నెల 18న సీఎం చంద్రబాబు పర్యటన. భద్రత, సభా ఏర్పాట్లపై కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉన్నత స్థాయి సమీక్ష.
మదనపల్లె: ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో...
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...