ప్రభుత్వ హాస్పిటల్లో 35 లక్షల అల్ట్రాసౌండ్ ల్యాబ్ ప్రారంభం

0
238

నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో రూ.35 లక్షల అల్ట్రా సౌండ్ ల్యాబ్ ప్రారంభం.

 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు.

 

నందిగామ పట్టణంలోని డివిఆర్ ఏరియా హాస్పిటల్‌లో శనివారం నాడు రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన అల్ట్రా సౌండ్ ల్యాబ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, కూటమి నేతలు, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్ ల్యాబ్‌లను మంజూరు చేయగా అందులో నందిగామ డివిఆర్ ఏరియా హాస్పిటల్ ఒకటిగా ఎంపిక కావడం ఆనందకరమని తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వైద్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి నందిగామకు అల్ట్రా సౌండ్ ల్యాబ్ మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అల్ట్రా సౌండ్ ల్యాబ్ ద్వారా గర్భిణులు, మహిళలు, పేద ప్రజలకు స్థానికంగానే కీలక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె కోరారు, అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ సభ్యులు, వైద్యులు, అధికారులు, కూటమి నేతలు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 216
Telangana
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్
మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్...
By Bheeshman King 2026-07-03 12:43:41 0 652
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి...
By Kothuru Murali 2026-02-10 07:24:53 0 264
Telangana
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు...
By Sidhu Maroju 2026-06-09 09:29:42 0 143
Andhra Pradesh
పుంగనూరు: శేష వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-25 04:33:39 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com