కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగ వర్ధంతి కార్యక్రమం

0
252

*వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం*

 

*కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి కార్యక్రమం*

 

*మంగళగిరి:*

బడుగు, బలహీన వర్గాల నాయకుడు దివంగత స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని కాపు సంఘం నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి కాపు సంఘం నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహన రంగా చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు అండగా తాము నిలబడతామని తెలిపారు. జై కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కాపు సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహా నాయకుడు అని తెలిపారు. పార్టీలకతీతంగా వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో, జనసేన నాయకులు అనిల్ బాబు, శివ నాగేంద్రం, నారిశెట్టి చంద్రశేఖర్, కాపు సంఘం నాయకులు తులం సాంబశివరావు, ఇండ్ల సత్యం, బత్తుల గణపతి, యుగంధర్, పోతన చిరంజీవి, నాగేశ్వరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*...
By Rajini Kumari 2025-12-16 12:26:04 0 262
Andhra Pradesh
నిరుద్యోగులకు శుభవార్త: ఏపీలో 529 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన.
ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి...
By Pagadala Venkateswar 2026-06-12 04:38:46 0 130
Telangana
తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు...
By Jagadeesh Babu 2026-05-20 09:34:20 0 398
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:11:51 0 310
Telangana
మల్కాజిగిరిలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.|
"సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు" మేడ్చల్ మల్కాజిగిరి,...
By Sidhu Maroju 2026-07-04 16:17:11 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com