ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|

0
226

హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో తిష్ట వేసిన ఒక అవినీతి తిమింగలం నేడు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది. 

ఒక కాంట్రాక్టర్ నుండి ఏకంగా 15 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ కూకట్ పల్లి జోనల్ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి పట్టుబడ్డాడు.

 

వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి జోన్ పరిధిలో పనులు పూర్తిచేసిన ఓ కాంట్రాక్టర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఎస్.ఈ చిన్నారెడ్డి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడు 

 

లంచం ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయని ఖరాఖండిగా చెప్పడంతో, భాదితుడు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించాడు. 

అధికారుల వ్యూహం ప్రకారం, నేడు కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ బృందం ఆయన్ని చుట్టుముట్టింది. 

 

రసాయనాలు పూసిన నోట్లను చిన్నారెడ్డి తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

 

చిన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం, ఆయన కార్యాలయం తో పాటు, ఆయన నివాసంలోను ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోధాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడా! అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

 

 

కూకట్ పల్లి జిహెచ్ఎంసి విభాగంలో ఇంతటి భారీ అవినీతి బయటపడడం నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

 

ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలతో ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో చిన్నారెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చినట్టు సమాచారం.

 

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్‌ హామీలు కొండంత.. అమలు గోరంత.|
● తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ● బస్తీ...
By Sidhu Maroju 2026-09-06 10:51:47 0 142
Andhra Pradesh
దేవాలయాలపై దాడులు చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు.
మంగళవారం, మదనపల్లిలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-05-06 06:51:17 0 128
Andhra Pradesh
గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్
గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు...
By John Baji 2025-12-24 16:04:51 0 429
Andhra Pradesh
పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి...
By Kothuru Murali 2026-03-30 11:54:54 0 176
Telangana
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది...K T R
రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం...
By Ponnala Srinivasrao 2026-08-12 01:17:24 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com