సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వాజ్పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు

0
288

సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్

విజయవాడ, డిసెంబర్ 25: 'సుపరిపాలన దినోత్సవం' సందర్భంగా గురువారం లోక్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన మాజీ ప్రధాన మంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ఘన నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, శ్రీ వాజ్‌పేయి గొప్ప వక్త, కవి మరియు సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుబడిన పరిపాలన దక్షకుడు అని అన్నారు. గ్రామాలను రహదారులకు అనుసంధానించే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానించే స్వర్ణ చతుర్భుజ్ ప్రాజెక్ట్ లాంటి అనేక సేవలను శ్రీ వాజ్‌పేయి దేశానికి అందించారని గవర్నర్ అన్నారు.

 గవర్నర్ జాయింట్ సెక్రటరీ శ్రీ పి.ఎస్. సూర్య ప్రకాష్, లోక్ భవన్ అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..!
అనంతపురం జిల్లా పుట్లూరులో విద్యార్థులు స్కూల్ బస్ కు అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధం..! పుట్లూరు...
By Eslavath RameshNaik 2026-01-28 14:02:57 0 712
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సభలో సెప్టెంబర్ 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలని అధికారులు పిలుపునిచ్చారు.
 MadanapalleAnnamayya district TDP updatesIntintiki TDP programMan పురస్కరించుకుని...
By Pagadala Venkateswar 2026-09-08 14:08:35 0 109
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...
By Gadiyapudi Narendra 2026-02-04 16:48:11 0 461
Arunachal Pradesh
Arunachal Strengthens Women's Empowerment Initiatives
Arunachal Pradesh continues to advance women's empowerment through initiatives focused on...
By Fathima Safa 2026-07-03 14:21:10 0 231
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజల కోసం ఈ రోజు అనగా 21-01-26న బుధవారం ఉదయం గుంటూరు తూర్పు...
By John Baji 2026-01-21 10:33:00 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com