అటల్ బిహారీ వాజ్పేయి గారిని కొనియాడిన దేవినేని ఉమామహేశ్వరరావు

0
287

ప్రజామన్ననలు పొందిన నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి ... సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించారు

 

దేవినేని ఉమామహేశ్వర రావు 

 

గొల్లపూడి: 25 డిసెంబరు 2025

 

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. 

 

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి ఎంతో కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారు. ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయన్నారు. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయ్ చూస్తే అర్థమవుతుందన్నారు. నాడు కార్గిల్, అణు పరీక్షలు ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలుగా చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రాణాంతకంగా మారుతున్న నిషేధిత చైనా మాంజ.|
  హైదరాబాద్ : పోలీసులు చైనా మాంజాపై ప్రజలకు ఎంత అవగాహన కలిగించినా ఇదే తరహా ఘటనలు జరగడం...
By Sidhu Maroju 2026-01-09 16:17:32 0 230
SURAKSHA
Jitendra Singh Gangwar: IPS Leader Upholding Law & Order
The Journey Begins A Distinguished Bihar Police Officer Committed to Security,...
By Fathima Safa 2026-08-01 12:05:31 0 349
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 2K
SURAKSHA
Neerabh Kumar Prasad, IAS: Champion of Good Governance
A Leader Who Believes Development Begins with Empowering People "Inclusive growth is meaningful...
By Lokeshwari Panthadi 2026-07-13 13:18:18 0 131
Andhra Pradesh
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
By Bhesetti Lovaraju 2026-01-29 13:22:43 0 662
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com