కరుణ చూపటమే క్రీస్తు సందేశము..

0
251

*కరుణ చూపడమే క్రీస్తు సందేశం* - గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ సర్వ మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు సకల మానవాళికి అనుసరణీయమని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ విజయ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమ‌, క‌రుణకు తార్కాణంగా సాగిన క్రీస్తు జీవన గమనం నేటికీ అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటివి మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని తెలిపారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు. క్రీస్తు సందేశాన్ని అర్థం చేసుకుని అంతా ఐకమత్యంతో మెలుగుతూ.. ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బత్తుల దేవానంద్, ముత్యం , పానుగంటి చైతన్య, జ్యోతి బాబు, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), బూసి రాజలత, కొరిటిపొటి ప్రేమ్ కుమార్, వెలుగూరి రత్న, గనిక జాన్సీ, భాగ్యరావు, ఆలా కిరణ్, గంగాధర్ రెడ్డి, పాస్టర్స్ బాలశౌరి, గిడియోన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_    *_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల....._*...
By Rajini Kumari 2026-04-01 08:55:53 0 173
Telangana
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.
1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప...
By Sidhu Maroju 2025-07-11 07:55:22 0 1K
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 501
Telangana
భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు...
By Sidhu Maroju 2025-11-29 10:26:39 0 216
Business & Finance
Maruti Suzuki Expands Manufacturing at Kharkhoda Plant
Maruti Suzuki has commenced commercial production at the second plant of its Kharkhoda...
By Navya Sree 2026-07-04 08:27:12 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com