ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన గుంటూరు కలెక్టర్ మరియు ఎస్పీ

0
249

 *ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్.పి* గుంటూరు, డిసెంబరు 24 : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు. వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా అటల్ స్మృతి వనంను ప్రారంభించనున్నారు. స్మృతి వనంలో అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, సత్య కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఎ అదనపు కమిషనర్ భరత్ తేజ, అదనపు ఎస్పీలు హనుమంతు, ఏ.టి.వి రవి కుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, రహదారులు భవనాలు శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, తహసిల్దార్ హరి బాబు, సి.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:34:41 0 1K
Business & Finance
Tripura Expands Bamboo Industry for Rural Growth
Tripura is strengthening its bamboo industry by improving processing facilities, promoting...
By Navya Sree 2026-07-06 07:08:45 0 69
Andhra Pradesh
మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి
🌿 మోతుకపల్లి గ్రామ పర్యావరణ విప్లవం: రతన్ టాటా గారికి పచ్చని నివాళి 🌿 శ్రీ హరిహరసుత మహాగణపతి...
By Venugopal Gopal 2025-12-28 15:55:53 0 629
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 51
Andhra Pradesh
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో...
By Pagadala Venkateswar 2026-07-15 05:32:58 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com