మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్

0
635

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

 

₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!

 

మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ నాయక్​ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

 

* ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది

* కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది

* ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి

* దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇళ్లు, కార్యాలయాలు సహా స్వగ్రామం నిజాంపేట మండలం బల్కంచల్క తండాలో దాడులు చేశారు.

* 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌లోని కిషన్‌ ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు

* మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి

* హిరంగ మార్కెట్‌లో వాటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా

* ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి

* ఆ మధ్య నీటిపారుదలశాఖ ఇంజినీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా, వాటన్నిటి కంటే కిషన్‌ ఆస్తిపాస్తులే అధికమని అంచనా

* సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి

* ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్‌పల్లిలోని కిషన్‌ ఇంటి తలుపుతట్టారు

* విశ్వసనీయ సమాచారంమేరకూ ఆ సమయంలో కిషన్‌ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు

* బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు

* కిషన్‌ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది

* సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు

* కిషన్‌ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు

* అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలు అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు

 

మొదటి నుంచి అవినీతి ఆరోపణలే 

 

* 1994 లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో అడుగుపెట్టిన కిషన్‌పై మొదటి నుంచి అవినీతి ఆరోపణలున్నాయి

* బోధన్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు

* అక్కడే మద్నూర్‌లో చెక్‌పోస్ట్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు

* నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా పనిచేశారు

* తాజా సోదాల్లో నిజామాబాద్‌లో అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది

* ఆ తర్వాత మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా కిషన్ పని చేశారు

* ఏడాదిక్రితమే మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా వెళ్లారు

* ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు

* నిజామాబాద్‌లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, 3 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని రాయల్‌ఓక్ ఫర్నిచర్‌షాప్‌లో ఓనర్‌షిప్, అశోక టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు

* సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయభూమి, 4 వేల గజాల్లో పాలీహౌజ్, నిజామాబాద్‌ మున్సిపాలిటి పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఉన్నట్లు నిర్ధారించారు

* కిషన్‌ బ్యాంకు ఖాతాలో రూ. 1.37 కోట్లు, బ్యాంకు లాకర్లలో కిలోకు పైగా బంగారం, రెండు కార్లు ఉన్నట్లు తేల్చారు

* కిషన్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లపైగానే ఉంటుందని అంచనాకి వచ్చారు

* సోదాల అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు

 

10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు 

 

* ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖలో యథేచ్ఛగా అవినీతి దందా సాగుతోంది

* 10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు నమోదవడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది

* డ్రైవింగ్‌ లైసెన్స్, బండి రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, వాహనం ఫిట్‌నెస్‌ ఇలా ఏ పనికావాలన్న రవాణాశాఖ కార్యాలయాల్లో అధికారిక ఛార్జీలతో పాటు అదనంగా ఇవ్వాల్సిందే

* ప్రతి సేవకి, ఫైల్‌కి ఒక రేటు ఉంటుంది ఆ మేరకు కోడ్‌ ఉంటుంది

* అందులో ఏజెంట్‌ ఎవరు, వచ్చే లంచం ఎంతన్న వివరాలుంటాయి

* కోడ్‌ ఉన్న దరఖాస్తులైతే నిమిషాల్లో పనైపోతుంది

* ఏజెంట్‌ ద్వారా కాకుండా నేరుగా వెళ్తే సిబ్బంది కొర్రీలపై కొర్రీలు వేస్తూ రోజుల తరబడి తిప్పించుకుంటారు

* ఈ అక్రమాల్లో జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి   టిడిపి నేత, మాజీ...
By Rajini Kumari 2026-01-11 09:42:32 0 190
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 11:11:28 0 122
Telangana
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండి
న్యూస్ (భారత్ ఆవాజ్ )   11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి...
By Midathapalli Kiran Kumar 2026-04-24 13:54:42 0 287
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 413
Gujarat
Vidyadeep Trust Distributes Educational Kits in Anida
In a commendable effort to enhance grassroots education, the Vidyadeep Trust recently organized a...
By Lokeshwari Panthadi 2026-06-27 08:44:35 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com