లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం

0
238

*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం* 

 

*మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్‌కు ప్రశంసా పత్రం*

 

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రశంసా పత్రం అందుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుని, లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసులను పరిష్కారానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గౌరవం లభించింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, రూరల్ ఎస్సై వెంకట్ అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ప్రశంసించారు. న్యాయ ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందేలా చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ, అంకితభావంతో పనిచేసినందుకే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ప్రోత్సహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు, డీఎస్పీ మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల శాంతి, భద్రతలే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్క్ టల్లి మరణం మీడియా లోకానికి తీరని లోటు
ప్రముఖ రచయిత జర్నలిస్టు మార్క్ టిల్లీ l భారతీయ అసలు సిసలు వ్యాఖ్యాత మార్క్ ఢిల్లీ కన్నుమూశారు...
By Benguluri Madhubabu 2026-01-26 07:08:17 0 283
Andhra Pradesh
మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-22 06:46:50 0 106
Andhra Pradesh
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
By Kothuru Murali 2026-06-16 13:42:33 0 122
BMA
Reader-Funded Power: The Strength of Independence
The ultimate strength of a newsroom is determined by who pays the bills. The Indian press is...
By JoinBMA 2026-08-21 10:31:01 0 61
Telangana
ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‎ ‎“ధర్మ...
By Ponnala Srinivasrao 2026-05-23 02:17:07 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com