డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

0
242

కర్నూలు : నంద్యాల జిల్లా : డోన్ : ద్రోణాచలం : 

డోన్ పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి తగిన పరిష్కారాలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన  రచ్చబండ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, త్రాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్, సంక్షేమ పథకాలు వంటి అనేక అంశాలపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విన్నారు.

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, పాతపేట ప్రాంతంలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిని రాబోయే వారం పది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే రైల్వే గేట్ల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్‌కు సంబంధించిన ర్యాంప్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు సమానంగా చేపడతామని తెలిపారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Healthcare Infrastructure and Public Health Expansion
Himachal Pradesh is enhancing its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-22 11:18:14 0 174
Telangana
ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!
తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య...
By Sunka Santhosh 2026-06-03 18:41:20 0 87
Andhra Pradesh
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు.
📍గంజాయి సంబంధిత, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పోలీసులు....
By John Baji 2026-01-21 13:37:06 0 226
Bharat Aawaz
THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:39:42 0 1K
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com