బస్తీ పర్యటనలో భాగంగా వార్డు నెంబర్ 4, వార్డు నెంబర్ 5. లలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
240

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం వార్డు 5 సింహపురి కాలనీ, వార్డు 4 ఫిషర్ పుర ఎరుకల బస్తీ లలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ , బస్తీల సమస్యలను స్వయంగా పరిశీలించారు.

అనంతరం కాలనీ,బస్తీ వాసులతో మాట్లాడుతూ వారికి అవసరమైన కమ్యూనిటీ హాల్, సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపిస్తానని,నూతన బోర్ వెల్స్ చేయిస్తానని చెప్పారు.

అలాగే నూతన కరెంట్ పోల్స్, 303 కోట్ల రూపాయలతో చేపట్టబోయే డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా నాలాల అభివృద్ధి గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం లభించేలా చూస్తానని కాలనీ, బస్తీ వాసులకు చెప్పడంతో తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపడంతో మీ ఓటు వృధా కానివ్వనని కాలనీ ,బస్తీలను అభివృద్ధి చేసి మీ ఆదరాభిమానాలు చూరగొంటానని ఎమ్మెల్యే వారికి చెప్పారు.

ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహ, సత్యనారాయణ, మల్లేష్, నాగేందర్ యాదవ్, సంతోష్, ఆనంద్, కిరణ్, బిక్షపతి, విష్ణు, కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, బస్తీ ప్రెసిడెంట్ శశి కపూర్ తదితరులు ఉన్నారు.

#Sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 219
Andhra Pradesh
పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్
బాపట్ల: పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:48:43 0 295
Andhra Pradesh
Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్.
జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే...
By Pagadala Venkateswar 2026-03-28 04:33:44 0 578
Telangana
నిజామాబాద్ :ముగిసినా ప్రశిక్షణ తారగతులు
రెండు రోజుల ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఇన్‌చార్జ్...
By Sadaq Sadaq 2026-05-29 16:39:20 0 124
Telangana
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన...
By Avunoori Mahesh 2026-06-02 05:29:56 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com