అక్రడేషన్ కార్డు జీవో విడుదల

0
521

మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, 'తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025'ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో (G.O.Ms.No.252) జారీ చేసింది. 

కొత్త నిబంధనల ముఖ్యాంశాలు:

1. అక్రెడిటేషన్ కమిటీల కాలపరిమితి:

రాష్ట్ర స్థాయి (SMAC) , జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయి.  

2. అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు:

* అక్రెడిటేషన్ కార్డు: ఇది ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది.  

* మీడియా కార్డు: డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే ఈ కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు మాత్రమే పనికివస్తాయి.  

3. డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలు:

డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ (Unique Visitors) ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారు.  

4. ఎలిజిబిలిటీ క్రైటీరియా:

* న్యూస్ పేపర్లు: కనీసం 2,000 ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రెడిటేషన్‌కు అర్హులు. PRGI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.  

* ఎలక్ట్రానిక్ మీడియా: శాటిలైట్ ఛానళ్లు 50% వార్తా కంటెంట్‌ను కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ చేయాలి.  

* జర్నలిస్టుల అర్హత: స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం ఉండాలి. 

•నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి.  

5. ఫ్రీలాన్స్ & వెటరన్ జర్నలిస్టులు:

15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

కమిటీల నిర్మాణం:

* రాష్ట్ర కమిటీ (SMAC): మీడియా అకాడమీ చైర్మన్ చైర్మన్‌గా, ఐఅండ్‌పిఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు.  

* జిల్లా కమిటీ (DMAC): జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.  

నిబంధనల ఉల్లంఘన జరిగితే:

అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రోత్ సెంటర్లో కార్డెన్ సెర్చ్
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల నివాస షెడ్లలో పోలీసులు...
By Boiena Rajesh 2026-08-25 03:52:18 0 96
Andhra Pradesh
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం: రోడ్డు ప్రమాదం లో హై స్కూల్ టీచర్ మృతి
మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు...
By Karapati Gopi 2025-12-29 04:59:39 0 426
SURAKSHA
Gaurav Yadav: Leading Punjab Police with Courage and Vision
The Journey Begins "A police force earns public trust not only through...
By Fathima Safa 2026-07-31 12:00:55 0 199
SURAKSHA
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
By Lokeshwari Panthadi 2026-07-15 04:39:37 0 145
Andhra Pradesh
Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-06 04:46:05 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com