ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ !!

0
232

కర్నూలు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ).. 51 నాన్-టీచింగ్ పోస్టులను భర్తీచేయనుంది. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి.
ఉద్యోగాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్టుల్లో ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. గ్రూప్-బి, సి పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటాయి. రాత పరీక్షలో అర్హత పొందినవారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
మొత్తం పోస్టుల్లో ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న గ్రూప్-బి, సి ఉద్యోగాల వివరాలు..
సెక్షన్ ఆఫీసర్: ఏదైనా డిగ్రీ, మూడేళ్ల అనుభవం లేదా ఎల్‌డీసీగా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో ఎనిమిదేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, నోటింగ్ డ్రాఫ్టింగ్ నైపుణ్యాలు ఉండాలి.
అసిస్టెంట్: డిగ్రీ, యూడీసీగా మూడేళ్ల అనుభవం ఉండాలి. టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, నోటింగ్, డ్రాఫ్టింగ్ నైపుణ్యాలు ఉండాలి.
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మూడేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
జూనియర్ ప్రోగ్రామర్: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌తో బీఈ/బీటెక్. లేదా ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్), రెండేళ్ల ప్రోగ్రామింగ్ అనుభవం ఉండాలి. సి/ సి++/ జావా లాంగ్వేజెస్, మైఎస్‌క్యూఎల్/ ఒరాకిల్ పరిజ్ఞానం ఉండాలి.
అప్పర్ డివిజన్ క్లర్క్: డిగ్రీ, ఎల్‌డీసీగా రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
స్టెనోగ్రాఫర్: డిగ్రీ, ఇంగ్లిష్/హిందీ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు రాయగలగాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు/ హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం.
ముఖ్య అంశాలు:
స్కిల్ టెస్ట్‌లో భాగంగా పది నిమిషాల డిక్టేషన్ ఇస్తారు. నిమిషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని.. దాన్ని 50 నిమిషాల్లో ఇంగ్లిష్‌లోకి, 65 నిమిషాల వ్యవధిలో హిందీలోకి ట్రాన్స్‌క్రిప్ట్ చేయగలగాలి.
ఎంపికైనవారిని ఢిల్లీ, అమరావతి, ఐజ్వాల్, మిజోరం, కేరళ, జమ్మూలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.
వయసు: యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 32 సంవత్సరాలు, మిగతా వాటికి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ పోస్టులు: జనరల్/ఓబీసీలకు రూ. 1500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు రూ. 750. గ్రూప్-బి పోస్టులు: జనరల్/ఓబీసీలకు రూ. 1000.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్'కు విశేష స్పందన
బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్'కు విశేష స్పందన లభించింది....
By Boiena Rajesh 2026-03-07 02:51:08 0 238
Andhra Pradesh
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా...(01.01.2026)- జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన...
By Hari Krishna 2026-01-01 04:55:20 0 236
Telangana
కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ
రామాయంపేటలోని కాట్రియాలలో '99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త...
By Katiyala JeevanRaj 2026-04-02 10:53:07 0 348
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...
By Kothuru Murali 2026-02-26 12:46:07 0 129
Andhra Pradesh
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి !!
కర్నూలు :కర్నూలు నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐర్ - సర్) ఓటర్ల మ్యాపింగ్...
By Hari Krishna 2025-12-14 06:31:07 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com