విన్నర్ రేంజ్‌లో రెమ్యునరేషన్.. 15 వారాలకు ఇమ్మాన్యుయేల్ ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?

0
270

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు ముందే ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ ప్రారంభంలో విన్నర్ మెటీరియల్ గ అనిపించిన ఈ జబర్దస్త్ కమెడియన్ ఇప్పుడు అనూహ్యంగా టాప్-3లో కూడా ప్లేస్ దక్కించుకోలేకపోయాడు. నాలుగో స్థానంతో రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాడు.

 

సుమారు మూడు నెలలుగా తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు మరికొన్ని గంటల్లో ఎండ కార్డ్ పడనుంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తనూజ, కల్యాణ్ లలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్పు అందుకోనున్నారని తెలుస్తోంది. కాగా శనివారం (డిసెంబర్ 20) నాటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయేల్, సంజన బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్ గా ఆడియెన్స్ మనసులు గెల్చుకున్న ఇమ్మాన్యుయేల్ తక్కువ ఓటింగ్ కారణంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతని అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. విన్నర్ అవ్వాల్సిన వాడిని టాప్-3లో కూడా లేకుండా చేశారని, ఇదంతా బిగ్ బాస్ యాజమాన్యం ఆడిస్తోన్న నాటకమని మండిపడుతున్నారు. కాగా టాప్-3 లో నిలవకున్నా ఇమ్మాన్యుయేల్ కు అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకి రూ.35వేలు, వారానికి రూ.2.25లక్షల చొప్పున భారీగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం 15 వరాలకు గానూ ఇమ్మాన్యుయేల్ సుమారు రూ.33,75, 000 వరకు అందుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభిస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే ఇమ్మూ విన్నర్ ప్రైజ్ మనీకి దగ్గరగా బాగనే సంపాదించాడని తెలుస్తోది.

 

ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విషయానికి వస్తే.. తనూజ, కల్యాణ్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈ రెండ్రోజుల నుంచి డిమాన్ పవన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఓటీంగ్ లో అతని ప్రభావం బాగా కనిపించింది. ఈ కారణంగానే ఇమ్మాన్యుయేల్ ను సైతం అధిగమించి మరీ టాప్-3లోకి వచ్చేశాడు.  మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్టుగా మాస్ మహారాజ రవితేజ రానున్నట్లు తెలుస్తోంది.

 

#Sivanagendra #Bigboss9 #Immanuel #Trendingnews #Bharathaawazguntur #Contestant

Search
Categories
Read More
Telangana
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు. కీలక ప్రకటన చేసిన...
By Sidhu Maroju 2025-06-15 08:04:15 0 1K
Telangana
మిలాదున్నబీ వేడుకలు
నిర్వహణ నిజామాబాద్: పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు జష్నే మిలాదున్నబీ...
By Sadaq Sadaq 2026-08-26 07:50:57 0 157
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 518
SURAKSHA
R. K. Mallick, IPS: A Guardian of Law and Public Trust
The Journey begins "A police officer's greatest responsibility is not merely...
By Fathima Safa 2026-07-28 13:28:42 0 146
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:40:30 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com