*నంద్యాల కేసు కెనాలకు ఘనంగా జలహారతి* *అతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*

0
267

*నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి*

*ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్*

నంద్యాల ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అయిన కేసీ కెనాల్ (కర్నూలు-కడప) కాలువకు బుధవారం ఘనంగా 'జలహారతి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ గారికి పోన్నాపురం కాలనీ వద్ద పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. 19వ వార్డు టీడీపీ ఇంచార్జి షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిరోజ్ గారు కాలువకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి సమర్పించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండీ ఫిరోజ్ గారు మాట్లాడుతూ నంద్యాల రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించే కేసీ కెనాల్‌కు తగినంత నీరు విడుదల కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, సాగునీటి లభ్యత పెరగడం వల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, బ్యాంకు తిమ్మయ్య, డైరెక్టర్లు మునియార్ ఖలీల్ , ఉప్పరి సురేష్ కుమార్ , కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, బోయ రామకృష్ణ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , చలం బాబు , మిట్నాల రవి , వడ్డే జనార్ధన్, ఖాజా శంకర్, సుబ్బయ్య, జనార్ధన్ ,సాయి రామ్, బద్రి శెట్టి రవి, మాజీ ఎంపీటీసీ జనార్దన్ గౌడ్ ,కెసిపి పుల్లయ్య, విద్యా కమిటీ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా, కోడూరు శీను, అడ్వకేట్ హరి, వార్డు సెక్రటరీ కాజా శంకర్, టిడిపి సీనియర్ నాయకులు పుట్ట నాగరాజు, గొల్ల రమణ, వెంకటరమణ, నాగేశం, రైటర్ ప్రసాద్ ,యువ నాయకులు సుబ్బు, శ్రీలం శేఖర్ ,

బూత్ ఇంచార్జ్ దివాకర్, షేక్ మూర్తిజ, జనసేన యువ నాయకుడు ఆకాశ రెడ్డి, ధనుంజయ శర్మ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనారు

Search
Categories
Read More
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు విచారం.. పవన్, జగన్, కేటీఆర్ సంతాపం...
By Pagadala Venkateswar 2026-01-28 10:32:39 0 174
Manipur
Security Forces Intensify Rescue Operations for Hostages
Security forces, along with specialized sniffer dog squads, have stepped up massive combing...
By Dunna Jessicaruth 2026-05-20 09:34:35 0 156
Andhra Pradesh
జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో లక్ష్మి అభిజత్య ప్రతిభ
జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య...
By Boiena Rajesh 2026-06-01 12:16:18 0 246
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో గాయపడి కోలుకుంటున్న సీనియర్ రిపోర్టర్ యుగంధర్‌ను జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు పరామర్శించి భరోసా కల్పించారు.
మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
By Pagadala Venkateswar 2026-08-08 11:35:33 0 107
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-08 00:46:48 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com