ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*

0
282

భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని కమ్యూనిస్టు బొమ్మలు సెంటర్లో శంకర కంటి వైద్యశాల వారి సహకారంతో అంధత్వ నివారణ సంస్థ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు ఈ విధమైనటువంటి ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహిస్తూ అట్టడుగు ప్రజానీకానికి మరింత చేరవుతున్నదని వారు తెలిపారు. ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని భారత దేశ రాజ్యాంగంలో కూడా అదే పొందుపరిచి బడినదని కానీ పాలకుల నిర్లక్ష్యం, అవినీతి ఆలోచనలతో విద్య,వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్నారని వారు విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలలో భాగంగా ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచ్చేసినటువంటి వైద్యుల బృందం ప్రజలకు బిపి,షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, నగర సమితి సభ్యులు చినపోతుల వెంకటరావు, అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 అభినందనలతో,

ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ కార్యదర్శి, గుంటూరు నగర సమితి

@Johnbaji.

Search
Categories
Read More
Sports
TATA IPL 2026 Playoff Ticket Madness Begins
The frenzy for the TATA IPL 2026 playoffs officially reached a fever pitch today as tickets went...
By Dunna Jessicaruth 2026-05-20 05:33:29 0 103
Andhra Pradesh
పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ...
By Kothuru Murali 2026-04-11 06:20:30 0 169
Andhra Pradesh
దేశ సంస్కృతిని సాంప్రదాయాలు ప్రతీకగా అయోధ్య సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
    *సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్*   *దేశ సంస్కృతి, సంప్రదాయాలకు...
By Rajini Kumari 2025-12-29 09:37:01 0 217
BMA
Ed-Tech Scrutiny: Media Exposing Education Scams
Following the collapse of major online education platforms, the Indian press has aggressively...
By JoinBMA 2026-08-21 09:16:50 0 107
Telangana
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...
By Ponnala Srinivasrao 2026-05-01 03:06:43 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com