స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
197

*అనకాపల్లి*

 

• స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

• పారిశ్రామిక కార్మికులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.

• ముఖ్యమంత్రితో కలిసి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో పాల్గొన్న మంత్రి నారాయణ, కొల్లు రవీంద్ర, కొణతాల రామకృష్ణ సహా ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు, అధికారులు.

• పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించిన సీఎం చంద్రబాబు.

• పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజల నుంచి సహకారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

• ఇంట్లో పనికి రాని వస్తువులను తీసుకుని నిత్యావసరాలు ఇచ్చే స్వచ్ఛ రథాన్ని పరిశీలించిన సీఎం

• స్వచ్ఛ రథాలు ఉపయోగపడుతున్నాయా అని స్థానికులు అడిగిన ముఖ్యమంత్రి.

• కంపోస్ట్ తయారీ యార్డ్ సందర్శించిన సీఎం చంద్రబాబు.

• చెత్తను కాంపోస్ట్ గా తయారీ చేసి రైతులకు ఎరువులను 

• అందిస్తున్న కంపోస్ట్ యూనిట్ నిర్వాహాకుడు.

• కంపోస్ట్ యూనిట్ ద్వారా అందించే ఎరువులు రైతులకు ఉపయోగపడుతున్నాయా అని ఓ రైతును అడిగి తెలుసుకున్న సీఎం... దిగుబడి కూడా పెరిగిందని చెప్పిన స్థానిక రైతు.

• అనంతరం ప్రజా వేదికలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

• పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తామని సభికులతో ప్రతిజ్ఞ చేయించిన విద్యార్థులు.

• ఉత్తమ తీరు కనబర్చిన పారిశుధ్య కార్మికులను సత్కరించి మొమెంటోలు అందించిన సీఎం చంద్రబాబు 

• సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ నిర్వహించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎస్వీడబ్ల్యూతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, 

• పంచాయతీరాజ్, సెర్ప్ మధ్య సీఎం సమక్షంలో ఎంఓయూ 

 

*అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....*

• దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోంది.

• ప్రజల భాగస్వాములతో ఏ కార్యక్రమం చేసినా అది శాశ్వతంగా ఉంటుంది... ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. 

• పరిసరాల పరిశుభ్రతే కాదు...ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి

• ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపించేది పారిశుధ్య కార్మికులే...వారికి కృతజ్ఞతలు తెలపాలి

• సర్క్యులర్ ఎకానమీ పాలసీ తెచ్చి రీ సైక్లింగ్ చేపట్టాం.

• కార్మికులు ఇళ్ల వద్ద చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. ప్రజలు వేర్వేరుగా చెత్తను అందిస్తున్నారని తెలిపారు.

• ఇది బలవంత కార్యక్రమం కాదు.. భావితరాల కోసం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి

• స్వచ్ఛ రథాలు తీసుకొచ్చాం. ప్లాస్టిక్, బాటిళ్లు వంటి వాటిని తీసుకుని వాటికి విలువకు సరిపడా సరుకులు అందిస్తున్నారు.

• వేస్ట్ నుంచి సంపద కలుగుతోంది...ఇది చాలా సంతోషం

• చెత్తను కంపోస్ట్ గా తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు.

• గతంలో ఎక్కువ రసాయనాలు వాడే రైతులు... ఇప్పుడు కంపోస్ట్ ఎరువులు వాడుతున్నామని రైతులు చెప్తున్నారు

• పారిశుధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సేవకులు. వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం.

• స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణా:ద్ర సాకారం కాదు. అందుకే వారికి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నాం.

• మీకు ఒక పిలుపు ఇస్తున్నా....175 నియోజకవర్గాల్లో జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం

• రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ నివారించాం.

• గత ప్రభుత్వం 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చింది.

• జనవరి 26కు రోడ్డుపై వేస్ట్ అనేది కనబడకుండా టార్గెట్ పెట్టుకున్నాం. 

• ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా పొడిచెత్తను సేకరిస్తున్నాం. వీటి సంఖ్య 100కు త్వరలోనే పెంచి మరిన్ని అందుబాటులోకి తెస్తాం

• పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్టుగా పెట్టుకున్నాం... ఇది 3.91 లక్షల ఇళ్లలో ఇది జరుగుతోంది.

• అలాగే రూరల్ ప్రాంతంలో 10 లక్షల ఇళ్లల్లో హెం కంపోస్ట్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే... 3.30 లక్షల ఇళ్లల్లో చేస్తున్నాం.

• మార్చి 26 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.

• ఇంటి వద్దే కూరగాయలు పండించుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.

• ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాల్సిందే. 

• అన్ని గ్రామాలు ఓడీఎఫ్ గా ఉండాలి. మరుగుడొడ్లు కట్టుకుని వినియోగించుకోవాలి.

• గతంలో నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాను...కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నా.

• కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్ లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారంచుడుతున్నాం

• ప్రభుత్వ సేవలు ఎంత వేగంగా ప్రజలకు అందించడం, డబ్బులు అడగకుండా సేవలు అందిస్తాం

• పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతాం. 

• నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని ప్రజలకు మాటిచ్చాం... సూపర్ 6 అమలు చేసి మీ రుణం తీర్చుకున్నాం.

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా రెడ్డి భాష ఘనవిజయం
రాయచోటి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి భాష ఎన్నిక 110 ఓట్ల కాను 74 ఓట్లు సాధించారు 40...
By Benguluri Madhubabu 2026-03-30 15:13:32 0 196
SURAKSHA
Architect of Assam's Growth: The Inspiring Journey of IAS Dr. Ravi Kota
From Ground-Level Governance to Global Policy: How Dr. Ravi Kota Shaped Modern Public...
By Kalaga Sailaja 2026-07-23 06:09:42 0 25
Andhra Pradesh
బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం 10వ తరగతి చదువుతున్న 60 మంది...
By Ratna Sekhar 2026-02-13 13:22:28 0 224
Andhra Pradesh
మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని...
By Pagadala Venkateswar 2026-04-05 11:13:23 0 198
Telangana
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
By Sidhu Maroju 2026-04-22 15:38:21 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com