మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్

0
240

*Press Release*

 

*మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*

 

*వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరణ*

 

*సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ*

 

మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వైసీపీ హయాంలో సర్క్యులర్ ను అమలుచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 6వేలకు పైగా ఓటింగ్ కలిగిన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సానుభూతిపరులమనే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రరావు ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్ల బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ రెండున్నర ఎకరాల భూమిని వైసీపీకి చెందిన బి.నాగిరెడ్డి, బి.శివరామిరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలెంకు చెందిన ఎమ్.శారదాంబ, ఎమ్.సునీత కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

*****

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు...
By Chennaiah Kati 2026-06-21 13:53:36 0 149
Andhra Pradesh
చంద్రబాబు అడిగిన రాజకీయాల్లోకి రాను నారా బ్రాహ్మణి
*చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను: నారా బ్రాహ్మణి*   రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్న...
By Rajini Kumari 2025-12-16 09:40:33 0 191
Andhra Pradesh
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్..
కర్నూలు జిల్లాకు చెందిన మానసకు హాస్టల్ సీటు ఇప్పించేలా చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్.....
By Chennaiah Kati 2026-06-11 08:21:14 0 140
Andhra Pradesh
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
 శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా...
By Boya Dasthagiri 2026-04-01 05:53:28 0 213
SURAKSHA
AP పోలీసులు నేడు: సామాజిక దురాచారాలపై పోరాటం
నేడు AP పోలీసులు సమాజంలోని దురాచారాలపై పోరాడారు. 25 జిల్లాల్లో గ్రామ సమావేశాలు పెట్టి బాల్య...
By Kalaga Sailaja 2026-07-04 09:35:15 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com