హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్ లు గొడుగులు శేష వస్త్రం రాతి పంచలోహ విగ్రహాలు రాయితీ

0
246

తిరుమల...

 

*హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి మ పంచలోహ విగ్రహాలు* *టిటిడి*

 

*ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానములు సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది*

 

నిబంధనలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 0877-2264276 అనే నంబరులో సంప్రదించగలరు.  

 

*మైక్ సెట్*

 

 

 

మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25,000లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ సి, ఎస్ టి లకు 90% రాయితీ మినహాయించి రూ.2,500/- డి.డి. తీసి పంపించాల్సి ఉంటుంది. ఇతరులకు 50% రాయితీ మినహాయించి రూ. 12,500/- చెల్లించాల్సి ఉంటుంది. 

 

 

ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుండి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.

 

గొడుగులు :

 

హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 % రాయితీతో రూ.7,250 లకే టిటిడి అందిస్తుంది.  

 

 

 ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో

 సదరు శాఖ సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, ఆలయ ఫొటోను జత చేసి దరఖాస్తు చేయాలి. సదరు పత్రాలతోపాటు రాయితీ మినహాయించి రూ. 7,250/- లకు డి.డిను జత చేసి పంపాలి.

 

*శేష వస్త్రం*

 

 

హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష వస్త్రాన్ని టిటిడి ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వాణాధికారి, తిరుపతి పేరుతో దరఖాస్తు చేయాలి. సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆలయ ఫోటోను జత చేయాలి.

 

రాతి & పంచలోహ విగ్రహాలు

 

శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25% ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు. 

 

పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 90% సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75% సబ్సిడీతో అందిస్తారు

 

దేవతా మూర్తుల రాతి పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారి, టిటిడి వారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి. 

 

 

 దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక తహసీల్దార్ / అసిస్టెంట్ కమీషనర్ నుండి సదరు ఎండోమెంట్ శాఖ తాజా సిఫార్సు లేఖ, ఆలయ బ్లూ ఫ్రింట్ ను ఏ4 సైజ్ లో అవసరమైన విగ్రహాల డ్రాయింగ్ , ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జత చేయాలి.

 

 ఎం.ఈ.వో లేదా డీఈవో లతో ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50% సబ్సిడీతో టిటిడి అందిస్తోంది

 

మఠాలు, ట్రస్ట్ లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50% రాయితీతో అందిస్తారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం 50 శాతం రిజర్వేషన్ల...
By Sidhu Maroju 2025-09-11 15:03:56 0 373
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-05-23 07:23:29 0 641
Andhra Pradesh
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...
By Ratna Sekhar 2026-03-11 03:42:40 0 420
Andhra Pradesh
విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన
*ప్రచురణార్థం* ది:19-04-2026   *వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ...
By Rajini Kumari 2026-04-19 12:29:33 0 157
SURAKSHA
: Janasevaka: Bringing Essential Police Services to Your Doorstep
The 'Janasevaka' initiative represents a transformative shift in community policing, designed to...
By Kalaga Sailaja 2026-06-26 10:44:58 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com