Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్

0
219

Scroll 

 

విజయవాడ 

 

వైఎస్ షర్మిలా రెడ్డి

APCC చీఫ్ 

 

- MNREGA పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు. 

 

- గోడ్సే వారసులైన మోడీ @narendramodi , మహాత్ముని సందేశాన్ని, ఆదర్శాలని అవమానించిన దేశద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు

 

- నాడు పేదవారికి పనిదినాలు కల్పించి, ఆత్మాభిమానంతో రెండుపూటలా భోజనం వారి కష్టంతో 

 

- వారు సంపాదించుకునే విధంగా కాంగ్రెస్ తీసుకువచ్చిన MNREGA పేరులో మార్పు చేసి బీజేపీ సర్కారు, 

 

- గాంధీగారి ఆదర్శాలను, విలువలను పూర్తిగా కాలరాసింది. 

 

- గోడ్సే వారసులైన, RSS ప్రతినిధులైన వీరు మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాల్ని తీవ్రంగా అవహేళన చేసి దేశద్రోహులనిపించుకున్నారు. 

 

- MNREGA అనేది కేవలం మహాత్ముని పేరుతో కూడుకున్నది కాదు. 

 

- గ్రామ స్వరాజ్, ఆత్మగౌరవం, స్వీయశక్తితో కడుపు నింపుకోవడం, ఇలాంటి విలువలు, ఆదర్శాలు నిండిన ఒక యజ్ఞము. 

 

- దానిని నాశనం చేసి మోడీ సర్కారు చరిత్రహీనంగా మారింది. 

 

- ఇప్పటికే రాజ్యాంగ, ప్రజాస్వామ్య, వ్యక్తిగత హక్కులను కాలరాసి దిగజారిన మోడీ సర్కారు ఇంకెంత దిగజారుతుందో.

 

- నాడు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్ సాకారం కావాలనే సదుద్దేశంతో MNREGA అందుబాటులోకి వచ్చింది. 

 

- గ్రామాల స్వయం సమృద్ధి, పాలన వికేంద్రీకరణ, స్వావలంబన, అతి ముఖ్యంగా స్వాభిమానం. 

 

- నేడు ఇవన్నీ గ్రామాలనుండి గుంజుకుని, గ్రామాల్లో ప్రజలు తమకాళ్ళపై తాము నిలవనీకుండా చేసే కుట్రలో భాగమే ఈ పథకంపై బీజేపీ దాడి. 

 

- అన్నీ తమ అధీనంలో ఉంచుకుని గ్రామాలను కట్టుబానిసలుగా చేసి, మరల వలసలు ప్రోత్సహించే మూర్ఖత్వమే.

 

- నాడు వైఎస్సార్ పాలనలో MNREGA లో దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. 

 

- నేడు మోడీ చెంచా పార్టీల్లా మారిన టీడీపీ, జనసేన, వైసీపీ, ఇంత దారుణం జరుగుతున్నా నోరు మెదపలేకపోవటం వారి రాజకీయ విలువల పతనానికి అద్దం పడుతోంది. 

 

- ఇంత ఘనమైన పధకాన్ని నాడు మన తెలుగు నేలపై ప్రారంభించడంలోనే అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్ తపన పడిన జీవనోపాధి, భద్రత, ఏ బీదవాడు ఆకలితో ఉండకూడదు అనే విషయాలు దాగివున్నాయి, 

 

- మరి నేడు వాటిని కూలదోసి, మరలా గోడ్సే రాజ్యాన్ని, RSS రాజ్యాంగాన్ని నెలకొల్పాలనే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.

 

- కాంగ్రెస్ @INCIndia ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోదు, 

 

- అడుగడుగు, బీజేపీ మార్కు ఫాసిజంపై పోరాటం చేస్తూనే ఉంటుంది. 

 

- ఖచ్చితంగా ప్రజల గొంతుకుగా మారి, వారి చేతిలో ఆయుధమై బీజేపీ సర్కారును చీల్చి పాతాళంలో తొక్కేస్తుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ ప్రచార రథం ప్రారంభం: ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని పిలుపు.
రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన...
By Pagadala Venkateswar 2026-02-28 07:00:37 0 175
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 186
Andhra Pradesh
పుంగనూరు: పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి: ఎం వి ఐ
పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్...
By Kothuru Murali 2026-06-09 13:38:32 0 115
Andhra Pradesh
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని INTCU రాష్ట్ర నాయకుCI...
By Boiena Rajesh 2026-07-15 16:40:08 0 167
SURAKSHA
Adarsh Katiyar, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies in earning the trust of the people while...
By Fathima Safa 2026-07-20 14:05:46 0 356
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com