జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తే ఊరుకోం.|

0
28

 

 

 సికింద్రాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీ వికామిషన్ - గ్రామీణ్ ( వీబీ - జీ - రామ్ - జీ) పేరుతో బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టడాన్ని,ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ DCC అధ్యక్షులు దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ MG రోడ్ లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని, కేంద్రంలోని బి జే పి ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీ గారి పట్ల చూపిస్తున్న వివక్షను, ద్వేషాన్ని ఖండించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతో ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కనీస పని దినాలు కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంతకుముందు ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉందని, నేడు బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ పథకంలో మార్పులు చేపట్టిందని, అలాగే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించాలని చూస్తుందని, కావున ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలలో జరిగిన ధర్నాలు రేపు గ్రామస్థాయి వరకు విస్తరిస్తాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి పాత పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

 ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సికింద్రాబాద్, సనత్ నగర్ ఇంఛార్జ్ లు ఆదం సంతోష్ కుమార్,కోట నీలిమ మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com