బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
242

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ పరిశీలనకు వెళ్లి మార్కెట్ మొత్తం కలియతిరిగి రైతులు, వ్యాపారులు,హమాలీలతో  మాట్లాడారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు,వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మరియు మౌలిక వసతులైన ఉపయోగం లేని టాయిలెట్లను తొలగించి నూతనంగా నిర్మించాలని, మార్కెట్లో రహదారులు పాడై పోయినందున రహదారులను అభివృద్ధి చేయాలని, మార్కెట్ ను ప్రతిరోజు క్లీనింగ్ చేపించాలని, ఓపెన్ డ్రైనేజీని శుభ్రం చేసి దోమల బారి నుంచి కాపాడాలని కోరారు.

 వ్యాపారులు కూడా లైసెన్సుల విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మన్, సెక్రటరీ ,కమిటీ సభ్యులు, కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమై మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై చర్చించి రాష్ట్రంలోనే అతి పెద్దదైన బోయిన్ పల్లి మార్కెట్ లో మెరుగైన మౌలిక వసతులను కల్పిద్దామని, మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్కెట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చిందని కావున మార్కెట్ సమస్యలను అవసరమైతే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళదామని, మార్కెట్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. మార్కెట్ పరిశీలనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల...
By Vanmoj Suryamohan 2025-12-31 21:05:43 0 482
Andhra Pradesh
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు....
By Kothuru Murali 2026-05-29 13:20:08 0 130
Telangana
జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|
హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్...
By Sidhu Maroju 2026-04-01 17:54:09 0 217
Andhra Pradesh
పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.
మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు...
By SivaNagendra Annapareddy 2026-06-12 13:53:02 0 304
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే...
By Kothuru Murali 2026-04-18 09:36:26 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com