జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో సేవా కార్యక్రమాలు

0
237

*జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సేవా కార్యక్రమాలు.*

 

*జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉదయభాను గారు.*

 

 

 

_జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో రక్తదానం, అన్నదానం మరియు పండ్లను మరియు మొక్కల పంపిణీ వంటి సేవ కార్యక్రమాలను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు ప్రారంభించారు._

 

_ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో జనసైనికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారని తెలియజేశారు అలాగే ఆకలి లేని సమాజం కోసం పేదలకు, బాటసారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అని తెలియజేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురికి మొక్కలను, ఆరోగ్యకరమైన పండ్లను పంపిణీ చేసామని అన్నారు._

_"సమాజ మార్పు కోసం, ప్రజల గొంతుకగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నేడు 13వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణం అని రాజకీయాల్లో జవాబుదారీతనం, సామాజిక బాధ్యతను పెంచడమే జనసేన లక్ష్యం అని, ఈ ఆవిర్భావ దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదు అని._ _ఇది ప్రజలకు సేవ చేసే ప్రతిజ్ఞ అని ఆయన తెలిపారు. ఈ రక్తదానం చేసిన ప్రతి జనసైనికుడికి, వీర మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు._ _అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా నాయకులకు, కార్యకర్తలకు ఉదయభాను గారు ధన్యవాదాలు తెలియజేశారు.._

 

 _ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మరియు NTR జిల్లా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, విద్యార్థులు పాల్గొన్నారు._

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-03-02 10:28:55 0 199
Telangana
కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ
రామాయంపేటలోని కాట్రియాలలో '99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త...
By Katiyala JeevanRaj 2026-04-02 10:53:07 0 495
Andhra Pradesh
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అనకాపల్లి*   • స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 13:18:10 0 234
Andhra Pradesh
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి సత్తా చాటిన బాపట్ల జిల్లా పోలీస్ కానిస్టేబుల్...
By Gadiyapudi Narendra 2026-01-08 12:26:41 0 264
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 06:12:19 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com