బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు నందు కరస్పాండెంట్ యస్.షాషావలి ఆధ్వర్యంలో

0
63

గూడూరు నందు కరస్పాండెంట్ యస్.షాషావలి ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో 

కరస్పాండెంట్ షాషా వలి,  

అకాడమిక్ అడ్వైసర్ బి.హనుమంతు,

కల్చరల్ ఆక్టివిటీ కోఆర్డినేటర్ కె.శేక్షావళి, దౌలత్ భాషా,

వైస్ ప్రిన్సిపాల్ షాకీరా బేగం,  

ఏ.ఓ. దేశ్ పాండే అబ్దుల్లా ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది . 

మొదటిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఆయన పటానికి పూలమాల వేసారు.

 

కరస్పాండెంట్ షాషావలి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారని అందులో ఒకరు మన జవహర్ లాల్ నెహ్రూ గారని తెలిపారు. ఆయనకు పిల్లలు అంటే చాలా మక్కువ అని అందుచే ఆయన పుట్టిన రోజును జాతీయ బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని అన్నారు.

పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అకాడమిక్ అడ్వైసర్ బి.హనుమంతు మాట్లాడుతూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు భారత స్వాతంత్రం కోసం చాలా కృషి చేశారని, గాంధీ గారి తో పాటు చాలా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారని, మన భారత మొదటి ప్రధాన మంత్రి గా కూడా ఉన్నారని మనమందరం ఇలాంటి గొప్ప వ్యక్తి ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలంటే నెహ్రూ గారికి ఎంతో ఇష్టమని అందుకు గాను ఆయన జన్మదినాన్ని జాతీయ బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు.కల్చరల్ యాక్టివిటీ కోఆర్డినేటర్ కోడుమూరు శేక్షావళి 

దేశ స్వాతంత్ర పోరాటంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రాముఖ్యతను వివరించి

 “పిల్లల ప్రగతే దేశ ప్రగతి“ అని ఆయన గట్టిగా నమ్మారని, 

పిల్లలే దేశ భవిష్యత్తు అని చెప్పారు.

పిల్లలందిరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

వైస్ ప్రిన్సిపాల్ షాకీరా బేగం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని దేశ భవిష్యత్తు నిర్మాతలని తెలిపారు, పిల్లలు మంచి నడవడిక మంచి విలువలు క్రమశిక్షణ తో కలిగి ఉండాలని తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని ప్రతిఒక్క పిల్లవాడు ప్రత్యేకమైన ప్రతిభ గలవారని సృజాత్మకతతో ముందుకు వెళ్ళాలని చెప్పారు.తర్వాత బాలల దినోత్సవం సందర్భంగా పెట్టిన ఆటలపోటీలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతి గా మెడల్స్ అందజేశారు తదుపరి విద్యార్థుని విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఆనందపరిచారు.చివరిలో వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం కావటానికి కృషిచేసిన పి టి అరవింద్ కు, ఉపాధ్యాలు-రాజు,జీవన్ కు మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపి విద్యార్థులందరికి మిఠాయిలు పంపిణీ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 47
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com