ఆ స్నేహితులు మద్యానికి బానిసలు, ముఠాగా ఏర్పడి దారిదోపిడిలు- అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
75

సికింద్రాబాద్ : మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడిలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఉత్తర మండల పరిధిలోని బేగంపేట,మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కత్తులతో బెదిరించి అమాయకుల నుండి దారిదోపిడిలకు పాల్పడుతున్న ఐదు మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు. నిందితుల నుండి రెండు కత్తులు, రెండు సెల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కేసులలో కార్ఖానా కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్ ప్రధాన సూత్రధారిగా జేబీఎస్ ,మడ్ ఫోర్డ్ ప్రాంతాలకు చెందిన నరసింహ, కార్తీక్, పరశురాం, శివ లు నేరానికి సహకరించినట్లు డిసిపి తెలిపారు. వీరంతా మధ్యానికి బానిసలుగా మారి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు ఒడిగట్టినట్లు స్పష్టం చేశారు. కళ్యాణ్ అనే వ్యక్తి విధులు ఊహించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో జేబీఎస్ వద్ద అతనిని అడ్డగించి కత్తులతో బెదిరించి 18 వేల రూపాయలను లాక్కొని పరారైనట్లు తెలిపారు. మరొక ఘటనలో పరేడ్ మైదానం వద్ద తన స్నేహితుని ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న అన్సారి అనే వ్యక్తిపై ఆటోలో వచ్చిన దుండగులు కత్తి తో దాడికి పాల్పడి అతని వద్ద ఉన్న ఆరువేల రూపాయలను అపహరించుకొని ఆటోలో పరారయ్యారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఈ దారిదోపిడీలు ఒకే ముఠా చేసిన పనిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Telangana
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్...
By Sidhu Maroju 2025-06-06 14:16:21 0 1K
Andhra Pradesh
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని
గూడూరు నగర పంచాయతీ నందు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By mahaboob basha 2025-08-07 14:22:28 0 588
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com