జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|

0
283

సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోని అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత నాలుగు సంవత్సరాలుగా మద్యం దుకాణం నడుస్తుండడం మూలంగా కాలనీవాసులు, విద్యార్థులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల మద్యం టెండర్లు పూర్తవగా వచ్చే నెల నుండి నూతన దుకాణాలు ప్రారంభం కానున్న తరుణంలో కాలనీ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందిన విద్యార్థినిలు,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. కాలనీ లోపలికి రావాలంటే భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యాలకు సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించేంతవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.
మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం...
By Pagadala Venkateswar 2026-01-23 07:30:08 0 201
Andhra Pradesh
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి...
By Gadiyapudi Narendra 2026-01-01 12:02:34 0 280
Andhra Pradesh
మదనపల్లె కలెక్టరేట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-05-29 05:21:46 0 114
SURAKSHA
Siddh Nath Gupta IPS: Leading Bengal with Courage & Vision
A distinguished IPS officer of the West Bengal Cadre, Shri Siddh Nath Gupta has dedicated over...
By Lokeshwari Panthadi 2026-07-28 11:16:20 0 114
Telangana
నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.....
  ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....! భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-11 05:20:08 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com