నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్

0
278

సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందచేశారు. ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ ఫిర్యాదుదారులకు సెల్ ఫోన్లను అందించారు. ఉత్తర మండల పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో చోరీ అయిన 111 సెల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ దొంగతనాలు పెరిగిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను గుర్తించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ల లో అత్యంత కీలకమైన సమాచారం సంక్షిప్తమై ఉంటున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్ కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 

#Sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో వృద్ధురాలి స్థలం కబ్జా.. అండగా నిలిచిన పోలీసులు.
మదనపల్లెలోని సురభికాలనీలో నివసించే చెంగమ్మ అనే వృద్ధురాలి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు...
By Pagadala Venkateswar 2026-03-07 04:56:34 0 201
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 208
Andhra Pradesh
తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు...
By Gadiyapudi Narendra 2026-03-01 16:11:52 0 276
Mizoram
Assam Rifles Seize Rs 113 Crore Drugs and 7,000 Detonators in Mizoram
In a major anti-narcotics operation in Mizoram’s border region, Assam Rifles recovered...
By Bharat Aawaz 2025-07-17 07:06:14 0 1K
Telangana
సింధు హాస్పిటల్ — మూడు పార్టీల చేతులు కలిసిన కథ
హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె...
By Ponnala Srinivasrao 2026-05-10 05:58:34 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com