హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా "రాష్ట్రీయ ఏక్తా దివాస్".|

0
67

 

 హైదరాబాద్ :  రాష్ట్రీయ ఏక్తా దివాస్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా 'రన్ ఫర్ యూనిటీ' – ఏడు జోన్లలో నిర్వహణ.

భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా 'రాష్ట్రీయ ఏక్తా దివాస్' (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (31.10.2025) ఉదయం 'రన్ ఫర్ యూనిటీ' ని ఘనంగా నిర్వహించినారు.

ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించినారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత, సమగ్రత మరియు భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగింది. ఈ 'రన్ ఫర్ యూనిటీ' లో సుమారు 5000 మంది పౌరులు, రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీ కొణిదెల చిరంజీవి (మాజీ కేంద్ర మంత్రి మరియు సినీ హీరో) ముఖ్య అతిథి, మరియు శ్రీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ) లు హాజరైనారు. 

వీరితో పాటు శ్రీ. సందీప్ శాండిల్య (రిటైర్డ్ ఐపిఎస్, డైరెక్టర్ ఈగల్), శ్రీ. యం.యం. భగవత్ ఐపిఎస్, (అడిషినల్ డిజిపి ఎల్. అండ్ ఓ తెలంగాణ), శ్రీ వి.సి. సజ్జనార్ (కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్), శ్రీ. తఫ్సీర్ ఇకుబాల్ ఐపిఎస్( జాయింట్ సిపి లా ఆండ్ ఆర్డర్), శ్రీ. డి. జోయల్ డెవిస్ ఐపిఎస్( జాయింట్ సిపి ట్రాఫిక్), శ్రీమతి కె. శిల్పావళ్ళి ఐపిఎస్( డిసిపి సెంట్రల్ జోన్), శ్రీమతి కె. అపూర్వారావు ఐపిఎస్( డిసిపి స్పెషల్ బ్రాంచ్), శ్రీమతి ధార కవిత (డిసిపి, సైబర్ క్రైమ్), శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ (డిసిపి, వుమెన్ సేఫ్టీ) మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మాజీ కేంద్ర మంత్రి మరియు సినీ హీరో శ్రీ కొణిదెల చిరంజీవి  మాట్లాడుతూ:

సర్దార్ పటేల్  దృఢ సంకల్పం, విజన్ మరియు కార్యదీక్షత నేటి తరానికి ఆదర్శనీయం అని అన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, 'వన్ నేషన్' ని మనకు అందించిన గొప్ప వరం సర్దార్ పటేల్ అని తెలిపారు. 'యూనిటీ ఇన్ డైవర్సిటీ' అనే పటేల్ సందేశాన్ని పోలీసులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయం. మరియు 'డీప్ ఫేక్' అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని, ఈ సమస్యను డీజీపీ మరియు హైదరాబాద్ సీపీ సజ్జనార్ గారు సీరియస్‌గా తీసుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని ధైర్యం చెప్పారు.

శ్రీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), తెలంగాణ  మాట్లాడుతూ:

ఇది కేవలం 'పరుగు' మాత్రమే కాదు, అందరూ జాతీయ ఐక్యత కోసం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ తన పట్టుదలతో 560కు పైగా ముక్కలైన సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి దేశాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. 

 

శ్రీ వి.సి.సజ్జనార్, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ , హైదరాబాద్  మాట్లాడుతూ:

యవత సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని తెలిపారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా, 'డీప్ ఫేక్' అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ నేరస్థుల మూలాలపై దృష్టి సారించాము. పిల్లలు 5,000 ,10,000 కోసం సైబర్ నేరస్థులకు మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఈ కార్యక్రమములో హైదరాబాదు సిటీ పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరు పాల్గోన్నారు. 

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు...
By Sidhu Maroju 2025-09-21 07:00:06 0 136
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని...
By Sidhu Maroju 2025-10-12 04:38:41 0 96
Haryana
New Water Treatment Plant Inaugurated to Strengthen Gurgaon’s Supply
Haryana Chief Minister inaugurated a 100 MLD (million litres per day) water treatment plant at...
By Bharat Aawaz 2025-07-17 06:51:32 0 965
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com