ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనుల వల్ల ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
253

సికింద్రాబాద్: ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈరోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు . కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ అడిషనల్ డిసిపి వేణుగోపాల్ రెడ్డి, హెచ్ ఎం డి ఏ డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టిందని దీనివలన ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు గురి కావద్దని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాలంరాయి చౌరస్తా,అన్న నగర్ చౌరస్తా లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీని వల్ల స్థానిక బస్తీల వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే వాహనదారులతో కూడా స్వయంగా మాట్లాడి వారి సూచనలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించిన పి.జ్ఞానవి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన...
By Pagadala Venkateswar 2026-06-22 06:42:22 0 116
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 298
Telangana
C m meets MD of Tata Lockheed Martin aero structures company
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎయిరోస్ట్రక్చర్స్ సంస్థ...
By G k Nookala 2026-04-08 11:25:11 0 208
Telangana
రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ
మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ  ప్రత్యేకంగా చేపట్టిన...
By Bheeshman King 2026-07-04 12:16:43 0 714
Andhra Pradesh
విద్యార్థుల కలలకు రెక్కలు
కలలకు రెక్కలు: నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల...
By Patan Khuddus 2026-05-05 08:22:27 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com