బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

0
82

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్ భవన్" కు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ డివిజన్ లోని బిఆర్ఎస్ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ లతో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులను ఈరోజు ఉదయమే శాంతి భద్రతల దృష్ట్యా  అల్వాల్ పోలీసులు తమ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కోసం గళం విప్పిన తమను హౌస్ అరెస్టు చేయకుండా ఇలా పోలీస్ స్టేషన్ కు  తీసుకురావడం సోచనీయమన్నారు. సబిత అనిల్ కిషోర్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రజాభిప్రాయానికి మద్దతుగా ఉన్న తమను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు.  

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...
By mahaboob basha 2025-07-25 01:51:01 0 898
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 125
Telangana
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
*_తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. వచ్చే వారం షెడ్యూల్ ప్రకటన..!!_* తెలంగాణలో స్థానిక...
By Vadla Egonda 2025-06-21 12:35:49 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com