బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

0
48

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్ భవన్" కు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ డివిజన్ లోని బిఆర్ఎస్ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ లతో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులను ఈరోజు ఉదయమే శాంతి భద్రతల దృష్ట్యా  అల్వాల్ పోలీసులు తమ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల కోసం గళం విప్పిన తమను హౌస్ అరెస్టు చేయకుండా ఇలా పోలీస్ స్టేషన్ కు  తీసుకురావడం సోచనీయమన్నారు. సబిత అనిల్ కిషోర్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రజాభిప్రాయానికి మద్దతుగా ఉన్న తమను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు.  

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com