సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు

0
100

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీర్ బాద్ ఏసిపి బాలగంగి రెడ్డి తెలిపారు.నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామగ్రి తో పాటు నాలుగు సెల్ ఫోన్లు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఒక మైనర్ తో కలిపి 5 మందిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జిహెచ్ఎంసి లో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్ తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్ లు యూసఫ్ గుడా ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారిని ఎసిపి వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జిహెచ్ఎంసి చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగలించిన సొమ్మును ముషీరాబాద్ లో జహీరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది.జూబ్లీహిల్స్ కు చెందిన చెత్త తరలించే వాహనం అల్వాల్ లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠాగా తేటతెల్లమైంది.  సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసుకునే వారిని పోలీసులు తెలిపారు.

  SIDHUMAROJU 

Search
Categories
Read More
Telangana
ఇవాళ తులం రూ.3,280 పెరిగిన బంగారం ధర |
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల...
By Bhuvaneswari Shanaga 2025-10-14 11:44:17 0 30
Telangana
ఫ్యూచర్ : సిటీలో ఫార్చూన్ 500 కంపెనీల లక్ష్యం |
తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 10 సంవత్సరాల్లో ఫార్చూన్...
By Bhuvaneswari Shanaga 2025-09-29 05:16:39 0 87
Business
CCI ORDERS PROBE ON ASIAN PAINTS
India’s fair trade regulator Competition Commission of India (CCI) has launched a formal...
By Bharat Aawaz 2025-07-03 08:36:25 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com