'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.

0
106

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు 126 - జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్ లో నిర్వహించిన మిలాద్-ఉల్-నబీ వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... తన బోధనలతో ప్రపంచానికి శాంతి, ప్రేమ, మానవత్వాన్ని మార్గనిర్దేశనం చేసిన గొప్ప బోధకులు "ప్రవక్త మహమ్మద్" అని అన్నారు. అనంతరం వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు.  అంతకు ముందు కార్యక్రమ నిర్వాహకులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, మైనారిటీ నాయకులు ఎండీ.అజమ్, సయ్యద్ సాజిద్, మక్సూద్ అలీ, మహమూద్, సోహైల్, ఇబ్రహీం, అన్వర్, సల్మాన్, ఖదీర్, తాహేర్, శౌకత్ అలీ, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com