ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...

0
479

ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...


ఆంధ్రప్రదేశ్: AP లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది...
2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది...
వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి...
ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి...
అయితే జన గణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండడంతో 2026 లో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమౌతోంది...
అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 50 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి...
దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225 కు పెరగనున్నాయి. అదే జరిగితే రాజకీయ ఆశావహులకు కొంతవరకు అవకాశాలు మెరుగు పడినట్టే..
విభజన చట్టంలో...
2014 లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పాటయింది..
ఇక తెలంగాణకు సంబంధించి 119 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంటు స్థానాలు మిగిలాయి...
ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగడంతో పాలనా వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు...
నియోజకవర్గాల పునర్విభజన తో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు, నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగలేదు..
కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం...
ప్రతీ పార్లమెంటు కి మరో 2 అసెంబ్లీ సీట్లు...
AP లో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన 175 స్థానాలు కొనసాగుతున్నాయి...
నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి లోక్ సభ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది...
2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది...
కొద్ది రోజుల్లో జనగణనతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుంది. 2025 లో జనగణను పూర్తిచేసి.. వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది...
ఆశావహుల్లో ఆశలు...
ప్రస్తుతం AP లో YSRCP, TDP, BJP, కాంగ్రెస్, జనసేన వామపక్షాలు ఉన్నాయి. TDP కూటమిలో BJP, జనసేన ఉంది....
అయితే అన్ని పార్టీల్లో నాయకులు ఆశావహులుగా ఉన్నారు. ప్రధానంగా TDP కూటమి, YSRCP లో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు...
ఒకవేళ పునర్విభజనతో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహు లకు చాన్స్ దక్కే అవకాశం ఉంది...
అందుకే AP నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో సంతోష పడుతున్నారు...

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం
నెహ్రు నగర్ వెంకటాద్రి పేటలోని, వృద్ధుల అనాధాశ్రమంలో, దీ నెహ్రు నగర్ వాకర్స్ అసోసియేషన్ వారు...
By John Baji 2025-12-30 01:23:06 0 237
Telangana
నిజామాబాద్: మండుతున్న ఎండలు
ఎండ తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త వహించండి! వేసవి తాపం మరియు వడదెబ్బ నుండి మనల్ని మనం...
By Sadaq Sadaq 2026-04-20 12:08:12 0 165
Telangana
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్‌ఎస్‌
పార్టీ పేరులో “టీఆర్‌ఎస్‌” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...
By Ponnala Srinivasrao 2026-04-25 05:34:07 0 147
Telangana
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా :  దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్...
By Avunoori Mahesh 2026-07-18 09:29:00 0 245
Andhra Pradesh
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
By Patan Khuddus 2026-04-17 07:33:33 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com