ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన

0
447

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న పొలిమేర షాప్‌లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  షాప్ యాజమాన్యం గత రెండు నెలలుగా అక్కడ పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో పనిచేస్తున్న మహిళలు ఒక్కొక్కరు రూ.12,000 చొప్పున పది మంది కార్మికులు తమ వేతనాలు పొందలేదని బాధతో తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించారు.  స్థానికులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్మికుల కష్టానికి తగిన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

@sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కోర్టు ఆదేశాలు ధిక్కరించిన కలెక్టర్‌పై చర్యలకు ఆదేశం |
సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝాకు తెలంగాణ హైకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. గతంలో...
By Bhuvaneswari Shanaga 2025-09-26 08:19:33 0 36
Andhra Pradesh
విజయవాడలో ‘సేవలో’ పథకం ప్రారంభం |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం “ఆటో డ్రైవర్లు సేవలో” అనే ప్రత్యేక పథకాన్ని...
By Bhuvaneswari Shanaga 2025-10-04 05:06:29 0 54
Telangana
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని...
By Sidhu Maroju 2025-10-21 10:38:28 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com