జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
587

సికింద్రాబాద్:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం జూబ్లీ బస్ స్టేషన్ డిపో, కంటోన్మెంట్ బస్ డిపో లలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డిపో అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు ,పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బస్ స్టేషన్ లోకి వచ్చే బస్సులు మెయిన్ గేటు లో ఆపి ప్రయాణికులను దించడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుందని, కంటోన్మెంట్ బోర్డు వారి స్థలాన్ని కొంత ఇప్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే కంటోన్మెంట్ సీఈఓ గారితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కంటోన్మెంట్ బోర్డు స్థలాన్ని అవసరమైతే ఆర్టీసీ వారికి నామ మాత్రపు ఫీజుతో లీజుకు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించడంతో వారు కూడా ఈ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పానికి మహిళా శక్తి పధకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గం లోని మహిళలకు బస్సులను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని, అదనపు బస్సులు అవసరమైతే నా దృష్టికి తీసుకువస్తే మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అందిస్తామని,ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా నా దృష్టికి తీసుకువస్తే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో, ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చి దిద్దడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

    --sidhumaroju 

Search
Categories
Read More
Telangana
శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆదివారం...
By Sidhu Maroju 2025-11-09 09:41:44 0 74
Media Academy
Media Ethics: Reporting with Responsibility
Media Ethics: Reporting with Responsibility With great power comes great responsibility....
By Media Academy 2025-04-29 08:34:46 0 2K
Telangana
బల్కంపేట ఆలయానికి కోటి రూపాయలు విరాళం అందించిన నితా అంబానీ
బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ విరాళం బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత...
By Vadla Egonda 2025-06-21 01:34:05 0 1K
Tripura
Central Tribal University Approved in Tripura to Empower Tribals
The Union Government approved a #CentralTribalUniversity in #Tripura.The university aims to...
By Pooja Patil 2025-09-13 10:56:37 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com