అల్వాల్ డివిజన్ మచ్చ బొల్లారంలో వాటర్ లీకేజ్ : రోడ్లపైకి నీరు గుంతల మయమైన రహదారులు

0
636

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.  

 

అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం ఎంజి నగర్ కాలనీలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న వాటర్ పైప్ లైన్ లీకేజ్ సమస్య కారణంగా రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారాయి. పలు మార్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎం డబ్ల్యూ బ్ల్యూ ఎస్ ఎస్ బి) అధికారులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.ఈ సమస్యను మహమ్మద్ జావేద్, శోభన్, వెంకట్, దేవేందర్,మహేష్,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో తక్షణమే స్పందించి మెట్రోపాలిటన్ వాటర్ సప్లైఅండ్ సీవరేజ్ బోర్డు సంబంధిత అధికారులకు రెండు రోజులలో ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ జితేందర్ నాథ్ స్పందిస్తూ...గతంలోనే వాటర్ బోర్డ్ అధికారులకు వినతి పత్రం అందజేసి... ఫోన్ ద్వారా కూడా సమస్యను తెలియజేశారు.మొత్తం మచ్చ బొల్లారం ప్రాంతానికి రోజుకు 14 లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతోంది. వాల్ కు రంద్రం ఏర్పడడంతో వాటర్ వాల్ లీకేజ్ వల్ల పెద్ద మొత్తంలో నీరు వృదాగా పోతోంది. దీనివల్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి.  తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ప్రస్తుతం వీధుల్లో నడవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనదారులు వృద్ధులు, మహిళలు, చిన్నారులు జారిపడి పడిపోవడం వంటి ప్రమాదాలు నెలకొన్నాయి. వాహనదారులు ప్రమాదకరంగా రోడ్లపై ప్రయాణిస్తున్నారు. వాటర్ బోర్డ్ అధికారులు తక్షణమే స్పందించి లీకేజ్‌ను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు . రోడ్ల మరమ్మతులు చేపట్టి భద్రత కల్పించాలి అని తెలిపారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణకు శ్రీకారం |
తిరుమల అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణకు పురావస్తు శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.4...
By Bhuvaneswari Shanaga 2025-10-23 10:40:31 0 43
Goa
FC Goa’s Brison Fernandes Wins Coach’s Praise |
FC Goa winger Brison Fernandes received high praise from coach Manolo following his impressive...
By Bhuvaneswari Shanaga 2025-09-22 06:14:33 0 46
Andhra Pradesh
రేషన్ డీలర్లు సరిగ్గా స్పందించకపోతే ఫిర్యాదు చేయండి.. కర్నూలు జేసీ డాక్టర్ నవ్య..
రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC   రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్...
By mahaboob basha 2025-06-01 05:23:46 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com