మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు.*

0
239

 

రాష్ట్ర విద్యా, ఐటీ, హెచ్.ఆర్.డి మరియు ఆర్.టి.జి శాఖల మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి (ఉండవల్లి )లోని వారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

 

ఈ సందర్భంగా శ్రీశైలం మండలంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బిసి హాస్టల్, పాలిటెక్నిక్, ఐ.టి.ఐ కళాశాలల నందు హాస్టల్ వసతి, భోజన శాల, తరగతి గదుల మరమ్మత్తులు, మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణం, త్రాగునీటి సదుపాయం ఏర్పాటికై వినతి..

 

అలాగే శ్రీశైలం నియోజవర్గంలో యువ గళం పాదయాత్ర సందర్భంగా శ్రీ లోకేష్ గారు ఆనాడు ఇచ్చిన హామీ.. ప్రతి చెంచు కుటుంబానికి ఇళ్లు నిర్మించి అందించే అంశంపై కూడా ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలపై మంత్రి శ్రీ లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గారి వెంట నియోజకవర్గ టిడిపి నాయకులు యుగంధర్ రెడ్డి ఉన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
By Sidhu Maroju 2025-09-26 18:04:24 0 87
Telangana
ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్టుల కఠినత |
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఇందులో సర్పంచ్, MPTC, ZPTC...
By Bhuvaneswari Shanaga 2025-10-01 12:20:35 0 38
Maharashtra
Maharashtra to Build 394 ‘NaMo Gardens’ in Towns |
To mark Prime Minister Narendra Modi’s 75th birthday, the Maharashtra government has...
By Bhuvaneswari Shanaga 2025-09-18 11:52:06 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com